Wednesday, 11 September 2013

డైనమిక్ సిటిజన్స్ ఫోరం- పరిచయం

డైనమిక్ సిటిజన్స్ ఫోరం అంటే కుటుంబ, వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మెరుగైన భారతదేశం కోసం మంచి సమాజాన్ని నిర్మించే దిశగా తమ వంతు కృషి చేయాలని తపిస్తున్న సమాజ శ్రేయోభిలాషులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే వేదిక.
డైనమిక్ ఆశయం- ప్రతి ఒక్కరి ముఖంలోనూ మానవత్వంతో కూడిన చిరునవ్వు కనిపించాలని డైనమిక్ కోరుకుంటోంది. సమాజంలో ఉన్నత విలువలను పెంపొందించడం, అన్ని రంగాల్లోనూ మంచి ప్రమాణాలతో కూడిన సేవలు అందేలా చూడడం, ప్రతి ఒక్కరిలోనూ తమ హక్కుల మీద అవగాహన కల్పించడం, సాధికారత సాధించే దిశగా వారిని ప్రోత్సహించడమనే ఆశయాలతో ముందుకు సాగుతోంది.

డైనమిక్ కార్యాచరణ ప్రణాళిక- తన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా డైనమిక్ సిటిజన్స్ ఫోరం కాగ్స్ (నాలెడ్జ్, అవేర్ నెస్, గైడన్స్ అండ్ సర్వీస్) విధానాన్ని అవలంబిస్తోంది. ఈ విధానం క్రింద పలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా కుల, మత, భాష, ప్రాంతీయ రాజకీయాలకతీతంగా ఎక్కువ మందిని తన పరిధిలోకి తీసుకుని వచ్చి, తద్వారా మంచి సమాజానికి కృషి చేయాలని భావిస్తోంది.ప్రజలను ఇబ్బందిపెట్టే పోరాటాలకు దూరం పాటిస్తూ, శాంతియుత మార్గంలో సాగనున్న ఈ ఉద్యమాన్ని దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని భావిస్తున్నాము.

ఈ మహోద్యమంలో పాల్గొనాలని ఆసక్తి కలిగిన వారు 09962991930 (తమిళనాడు), 9505960598 నెంబర్లలో ఫోరం వ్యవస్థాపకులు బొప్పన శ్రీనివాసులును సంప్రదించగలరు. అలాగే ఫోరం చేపడుతున్న కార్యక్రమాలకు నగదు రూపేణా సహాయం అందించదలచిన వారు క్రింద కనబరచిన బ్యాంకు ఖాతాలో సొమ్మును జమ చేయగలరు.
ఖాతా సంఖ్య: 32507716578
ఖాతాదారుడి పేరు: Dynamic Citizen’s Forum
శాఖ: Varadaiapalem (Chitoor Dist), IFSC CODE:SBIN0005378